Kangana Ranaut: కోలీవుడ్‌లో ప్రశంసలు.. బాలీవుడ్‌లో విమర్శలు: స్పందించిన కంగనా

సెకన్లలో వైరల్ | ఆవేశపూరిత నటి కంగనా రనౌత్ యొక్క వీడియో బయటపడింది … ఇప్పుడు మరియు మరిన్ని బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి …

ప్రతిరోజూ ఏదో ఒక విషయంపై సోషల్‌ మీడియా వేదికగా కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కంగనా రనౌత్ (జననం 1986 మార్చి 23) ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం …

హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా.  ఆమెతల్లిదండ్రుల గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని  అనుకునేవారు ఆమె చిన్నప్పుడు. కానీ తన 16వ ఏట తన  కెరీర్ తానే నిర్మించుకోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ  తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారామె. వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె.

‘చంద్రముఖి 2’ సినిమా చిత్రీకరణ లో బిజీ గ ఉండి కూడా భోజనం బ్రేక్ లో అభిమానులతో ముచ్చటించిన కంగనా రనౌత్‌ (Kangana Ranaut) 

అప్పుడప్పుడు అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ముచ్చటిస్తుంటారు. సోమవారం తాను ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నప్పటికీ భోజన విరామ సమయంలో  #askkangana అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్‌తో ఆమె చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ ఆసక్తికర విశేషాలను ఇప్పుడు చూద్దాం.

* లారెన్స్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తోంది?

కంగనా: లారెన్స్‌ అద్భుతమైనవ్యక్తి. నా ప్రతిభను ప్రశంసించే లారెన్స్‌ ని నేను ఇంకా కలవలేదు.

* ప్రభాస్‌తో మీకున్న అనుబంధం గురించి వివరిస్తారా?

కంగనా: ప్రభాస్‌ అంటే ముందుగా నాకు గుర్తొచ్చేది వారి ఇంట్లో ఆదిత్యమే. అతడి ఇంట్లోని భోజనం చాలా బాగుంటుంది. ప్రభాస్‌ మంచి హోస్ట్‌ కూడా.

* కార్తీక్‌ ఆర్యన్‌పై మీ అభిప్రాయం?

కంగనా: అతను చాలా కూల్‌.

సెల్ఫ్‌మేడ్‌ యాక్టర్‌.

తను ఎలాంటి బృందాల్లో కలవడు. తనదైన మార్గం లోనే తానుప్రయాణిస్తుంటాడు.

* హృతిక్‌ రోషన్‌, దిల్జీత్‌ దోసాంజ్‌.. వీరిద్దరిలో మీ అభిమాన నటుడెవరు?

కంగనా: ఒకరు యాక్షన్‌, మరొకరు వీడియో సాంగ్స్‌ చేస్తారని నేను అనుకుంటున్నా. నిజంగా చెబుతున్నా వారు నటించడం నేను ఇప్పటివరకు చూడలేదు. వారి నటనను చూసి అప్పుడు మాత్రమే సమాధానం ఇవ్వగలను. అలాంటిది ఎప్పుడైనా జరిగితే నాకు తెలియజేయండి.

* ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియాలో మీ ‘టీకూ వెడ్స్‌ షేరు’ ఎప్పుడు విడుదలవుతుంది?

కంగనా: నేను ముంబయి కి వెళ్ళగానే అమెజాన్‌ ప్రైమ్‌ సంస్థతో దానికి గురించి చర్చిస్తాను. త్వరలోనే అది విడుదలకావొచ్చు.

* తమిళ సినిమాల్లో నటించడం ఎలా అనిపిస్తుంది? హిందీ, తమిళ చిత్రాలకు తేడా ఏం గమనించారు?

కంగనా: ‘చంద్రముఖి 2’.. తమిళంలో నేను నటిస్తున్న మూడో చిత్రం. నేను ప్రొఫెషనల్‌ నటినని, నా పని నేను చూసుకుంటానని, సైలెంట్‌గా ఉంటానని, ఎవరితోనూ పిచ్చాపాటీ మాట్లాడడని కోలీవుడ్‌ వారు అంటుంటారు. ఈ లక్షణాలు నాలో చూసి నన్ను బాలీవుడ్‌ వారు అహంకారి అని పిలుస్తారు.

* భవిష్యత్తులో మీరు ఓ ప్రేమకథను రాసి, దానికి దర్శకత్వం వహించాలి. అది అద్భుతంగా ఉంటుందని విశ్వసిస్తున్నా.

కంగనా: తప్పకుండా. లవ్‌స్టోరీ తీయాలని నా ఎజెండాలో ఉంది.

* రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు?

కంగనా: దాని గురించి కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి నటిగా ఇంకా చాలా చేయాలనుకుంటున్నా.

* కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు మీకేం అనిపిస్తుంది?

కంగనా: సో.. సో.. స్వీట్‌

* మీరు యోగా చేస్తుంటారా?

కంగనా: టీనేజ్‌ నుంచి నేను యోగా, ధ్యానం చేస్తున్నా. మెడిటేషన్‌లో భాగమైన శూన్య, సంయమలాంటి వాటిని ఇషా ఫౌండేషన్‌ వారి సహకారంతో నేర్చుకుంటున్నా.

* మీ బలమేంటి? బలహీనత ఏంటి?

కంగనా: ధైర్యంగా ఉండడమే నా బలం. బలహీనతను నేను దగ్గరకు రానివ్వను. కానీ, నాలో నెగెటివ్‌ ఏదైనా ఉందంటే అది నా కోపం కావొచ్చు!

* మీ జీవితంలో మరిచిపోలేని సంఘటన?

కంగనా: నేను యుక్త వయసులోనే ఇంటికి దూరమయ్యా. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని నాకు ఓ వ్యక్తి సమస్యలను ఎలా అధిగమించాలో చెప్పారు. శారీరకంగా, మానసికంగా నన్ను నేను మార్చుకున్నా. దేన్నైనా ఎదుర్కొనే శక్తిని అప్పుడే పొందా.

* నిజం, ప్రేమ.. ఈ రెండింటిలో దేనిని ఎంపిక చేసుకుంటారు?

కంగనా: నేను నిజాన్ని ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే ప్రేమే మనల్ని ఎంపిక చేసుకుంటుంది తప్ప దాన్ని మనం ఎంపిక చేసుకోలేం.

* మీకు బాగా ఇష్టమైన రంగు?

కంగనా: తెలుపు, ఆకుపచ్చ

రజనీకాంత్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో గతంలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘చంద్రముఖి’కి కొనసాగింపుగా ‘చంద్రముఖి 2’ తెరకెక్కుతోంది. పి. వాసు దర్శకుడు. ఈ సీక్వెల్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ హీరోగా, రాజనర్తకిగా కంగనా రనౌత్‌ నటిస్తున్నారు.

సెకన్లలో వైరల్ | ఆవేశపూరిత నటి కంగనా రనౌత్ యొక్క వీడియో బయటపడింది … ఇప్పుడు మరియు మరిన్ని బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి …