#RIP Taraka Ratna: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇవాళ తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇవాళ తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం నందమూరి తారకరత్న భౌతికాయాన్ని ఫిల్మ్ చాంబర్‌లో ఉంచారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహం నుంచి కాసేపటి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తారకరత్నకు నివాళుల్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

నందమూరి తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. తండ్రి మోహనకృష్ణ కుమారుడికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. హైదరాబాద్‌ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, నారాలోకేశ్‌, ఎంపీ విజయ సాయి, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

కేఏ పాల్‌ నివాళులు.. భౌతికకాయం వద్ద ప్రత్యేక ప్రార్థనలు

తారకరత్న భౌతికకాయం వద్ద ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నివాళులర్పించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు

సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఫిలిం ఛాంబర్‌కు చేరుకున్న ఆయన తారకరత్న కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన పక్కనే ఎంపీ విజయసాయి కూడా ఉన్నారు.