Delhi LNJP Hospital: బిడ్డ చనిపోయింది అని పెట్టెలో పెట్టారు .. మూత తెరిచి చూస్తే అంతా షాక్!!

ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో నిర్లక్ష్యానికి సంబంధించిన ప్రధాన కేసు వెలుగు చూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నవజాత బాలికా శిశువు సుమారు రెండున్నర గంటల పాటు పెట్టెలో పడి ఉంది. అసలు ఎం జరిగిందంటే, ఆదివారం ఒక మహిళ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆదివారం, ఆరవ నెలలో జన్మించిన నెలలు నిండని ఆ ఆడ శిశువు చనిపోయినట్లు ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆపై ఒక బాక్సులో ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు ఇంటికి వచ్చి పెట్టె తెరిచి చూడగా చిన్నారి బతికే ఉంది. ఆ ఆడబిడ్డ చేతులు, కాళ్లు కదుపుతూ కనిపించింది.

దీని తరువాత, కుటుంబం మళ్లీ ఆడ శిశువుతో ఆసుపత్రికి చేరుకుంది మరియు నవజాత శిశువు కదలికల గురించి వైద్యులకు సమాచారం అందించింది, అయితే వైద్యులు శిశువును చూడటానికి కూడా నిరాకరించారు. అనంతరం వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో, ఆసుపత్రి వారు బాలికను తిరిగి చేర్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంది.

ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్ ఎండీ సురేష్ కుమార్ మాట్లాడుతూ “ఆదివారం ప్రీ టర్మ్ డెలివరీ జరిగిందని  తెలిపారు. అప్పుడు ఆడబిడ్డలో చలనం లేదు. అనంతరం బిడ్డ కదలికలపై సమాచారం అందింది. ప్రస్తుతం శిశువును వెంటిలేటర్‌ సపోర్టుపై ఉంచాం. నిపుణులైన వైద్యుల బృందం ఈ కేసును పర్యవేక్షిస్తోంది” అన్నారు.

దీనిపై విచారణకు ఆదేశించామని, 24 గంటల్లో సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిన్నారిని పెట్టెలో బంధించి ఉండటాన్ని గమనించవచ్చు. ఆ పెట్టెకు ఒక టేప్ కూడా అంటించి మూసేశారు. కుటుంబ సభ్యులు పెట్టె తెరిచి చూసే సరికి ఆడబిడ్డ చేతులు, కాళ్లు కదుపుతూ కనిపించింది. ఇది మొత్తం అన్ బాక్సింగ్ వీడియోగా రికార్డ్ చేసారు.