Vijayawada Crime News: విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం

Vijayawada Crime News Mar 3: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

అసలేం జరిగిందంటే..?

సీఐ కాగిత శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. స్టేషన్‌ పరిధిలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్‌(45) బీపీసీఎల్‌ కంపెనీలో పైపులైను సెట్టింగ్‌ పనులు చేస్తుంటాడు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(35) శాంతినగర్‌లో తన భర్తతో కలిసి పచారీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణంలో సరకులు కొనుగోలు చేసి, ఫోన్‌ పే, పేటియం ద్వారా పలుమార్లు నగదు చెల్లింపులు చేసే సందర్భంలో ఆ మహిళ ఫోన్‌ నెంబరును తెలుసుకున్నాడు సుభాష్‌. అలా.. సరకులకు వెళ్లినప్పుడల్లా ఆమెతో మాటలు కలిపాడు. ఒక రోజున ఆమె.. రాజీవ్‌నగర్‌లోని ఇంటి వద్ద స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి, తన మాట వినకపోతే ఫొటోలు బయట వ్యక్తులకు చూపుతానంటూ బెదిరించాడు. ఆమె వద్దని వారిస్తున్నా.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా… ఆమెను బెదిరించి రూ.16లక్షల నగదు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఆమె అడిగితే.. కొట్టాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేయడం, తాజాగా ఆమెను కొట్టడంతో వేధింపులు తాళలేని బాధితురాలు… ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సాయంతో సుభాష్‌పై బుధవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి సుభాష్‌కు రిమాండ్‌ విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇటీవలే కోనసీమ జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచాారం

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంచనలం అయిన బాలికపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 6న బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకిరామ్ ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు.  నిందితులు ఓలేటి బ్రహ్మతేజ(20), ఓలేటి తులసీరావు(21), ఓలేటి ధర్మారావు(21), మాల్లాడి వంశీ(20), అర్ధాని వీరబాబు(21) అరెస్ట్ చేసి, ముమ్మిడివరం కోర్టులో హాజరుపర్చారు.  నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.