ATM: డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లున్నారా?

*డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లున్నారా? ఇలాంటి వారితో జాగ్రత్*

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వారికి ఏటీఎం పిన్ నంబర్స్ కానీ, ఏటీఎంలు కానీ ఇవ్వొద్దని,డిపాజిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని కృష్ణ లంక పోలీసులు తెలిపారు.

విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉండే చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి గత నెల 5 వ తేదీన అతడి బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ వేసుకోవాలని అతనికి దగ్గరలో ఉండే ఏటీఎం మిషన్ వద్దకు వెళ్ళాడు. కానీ డిపాజిట్ మిషన్ నుంచి అంత డబ్బునుపంపాలి అంటే సమయం పడుతుంది. ఐనా అతడు కొంచెం కొంచెంగా డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పక్కన ఉన్న వ్యక్తి అదంతా గమనిస్తూ ఆ వ్యాపారితో మాటలు కలిపాడు. తానులక్ష రూపాయల తీయాలని.. కాకుంటే ఇంట్లో వారికి బాగోక హాస్పిటల్ లో చేర్చే హడావుడిలో ఏటీఎం తీసుకు రాలేదని చెప్పాడు. హాస్పిటల్ లో ఉన్న వ్యక్తి కి వెం టనే ఆపరేషన్ చేయాలి లేకుంటే ప్రమాదమని చెప్పాడు.మీ వద్ద ఉన్న డబ్బులు నాకు ఇస్తే.. నేను మీ అకౌంట్‌కి డబ్బులు పంపిస్తానని నమ్మ బలికించాడు.

వ్యాపారి అజ్ఞాత వ్యక్తికి తన వద్ద ఉన్న డబ్బును ఇచ్చాడు. అజ్ఞాత వ్యక్తి ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి పంపాను చూసుకోండి అని చెప్పగానే… ఆ వ్యాపారి నెంబర్ కి డబ్బులు వచ్చి నట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే అకౌంట్‌ని చెక్ చేసుకుంటే డబ్బు రాలేదు. మెసేజ్ వచ్చింది కదా.. డబ్బులు నిదానంగా వస్తాయి నమ్మకం లేకుంటే నా ఫోన్ నెంబర్, నా ఐడి, నా ఆధార్ కార్డ్ తీసుకోండి అంటూ నమ్మించి అక్కడ నుండి జారుకున్నాడు. రెండు రోజులు గడిచినా.. డబ్బు జమ కాకపోవడంతో మళ్ళీ వ్యాపారి అతడికి ఫోన్ చేయగా అతడు దాదాపు 25 రోజులు పాటు కబుర్లు చెప్తూ నమ్మించాడు. అలాగే మరుసటి రోజు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించాడు. చివరకు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వారికి ఏటీఎం పిన్ నంబర్స్ కానీ, ఏటీఎంలు కానీ ఇవ్వొద్దని,డిపాజిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని కృష్ణ లంక పోలీసులు తెలిపారు