TTD: స్వామి వారి దర్శనానికి వర్చువల్ దర్శన మరియు సేవా టిక్కెట్లు లేని భక్తులు…

తిరుమల స్వామి వారి దర్శనానికి ఎటువంటి 300 రూపాయల,వర్చువల్ దర్శన మరియు సేవా టిక్కెట్లు లేని భక్తులు…

నడకదారికి దర్శనానికి సంబంధం లేదు. గతంలో నడకదారిలో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు ఇప్పుడు ఇవ్వడం లేదు..దర్శన సమయం రద్దీని బట్టి ఉంటుంది..

భక్తులు ఉచిత దర్శనం SSD టోకెన్ వేయించుకోండి..మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది.. అదే సరాసరి దర్శనానికి వెళితే 15 గంటలకు పైగా పట్టే అవకాశం.రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం పెరిగే అవకాశం ఉంది.

ఈ SSD టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు..

( మీరు ఉదయం ఐదు ఆరు గంటలకు వెళితే దొరుకుతాయి..ప్రతీ ఒక్కరూ మీ ఆధార్ కార్డుతో వెళ్ళవలసి ఉంటుంది.12 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్ అవసరం లేదు.

1. తిరుపతి రైల్వేస్టేషన్ ఆరో నెంబరు ఫ్లాట్ ఫారమ్ కు ఎదురుగా ఉన్న గోవిందరాజ స్వామి సత్రం వద్ద..

2. బస్టాండు ఎదురుగా శ్రీనివాసం యాత్రికుల వసతి సదుపాయంలో..

3. అలిపిరి బాలాజీ బస్టాండు వద్ద కల శ్రీ బాలాజీ కాంప్లెక్స్ లో..