Nalgonda Crime: స్నేహం ముసుగులో కనీ వినీ ఎరుగని రీతిలో హత్య

*అబ్దుల్లాపూర్ మెట్  లో జరిగిన హత్యలో అత్యంత దారుణమైన విషయాలు

*స్నేహం ముసుగులో కనీ వినీ ఎరుగని రీతిలో హత్య

*తాను ప్రేమించైనా అమ్మాయినే నవీన్ ప్రేమించాడు అనే కసితో ఈ దారుణం

*నవీన్ విషయం లో అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన హరిహర కృష్ణ

*నవీన్ తల మరియు మొండెము ను వేరుచేసి హరి

*మర్మాంగాన్ని కూడా కోసేసిన హరి

*నవీన్ గుండెను కూడా పెకిలించిన హరి

*నవీన్ b.tech ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఆతను ఆరిన కొలాజ్ చదువుతున్న విద్యార్థి.

నవీన్, హరి హర కృష్ణ, మరియు యువతి ఈ ముగ్గురు ఇంటర్ లో క్లాసుమెంట్స్ 

నవీన్ హత్య కేసు FIR లో కీలక అంశాలు 

నిందితుడు హరి హర కృష్ణ పై సెక్షన్ IPC 302, 201, 5(2)(V), SC, ST, POA Act సెక్షన్ కింద నమోదు 

నిందితుడు పేరాల హరికృష్ణ మూసారాంబాగ్ కు చెందినవాడు.

పోలీస్ ల ముందు నేరాన్ని అంగీకరించిన హరి హర కృష్ణ 

*నవీన్ తను దిలుషుక్ నగర్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నాము అని, ఆ సమయం లోనే తాను ఒక స్నేహితురాలిని ప్రేమించాను అని పొలిసులకు వెల్లడించాడు. కొన్ని కారణాలు వల్ల ఆ అమ్మాయి తనకి దూరం అయిందని, దీనిని నవీన్ తనకి అనుకూలంగా మార్చుకుని ఆ అమ్మాయిని ప్రేమించాడు అని పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ అమ్మాయి కూడా నవీన్ తో క్లోజ్ గా మెలిగిందని, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక గత 3 నెలలుగా హత్యకు ప్లాన్ చేశానని విచారణలో వెల్లడించాడు హరి హర కృష్ణ.
ఫిబ్రవరి 17వ తేదీన నేను, నవీన్ కలిసి కొన్ని ప్రాంతాలకు తిరిగాం. ఆ తరువాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. అక్కడి నుంచి తాను ఇంటికి వెళ్తానని నవీన్ చెప్పడంతో.. హోండా షైన్ బైక్ మీద ఇద్దరం కలిసి బయలుదేరాం. పెద్ద అంబర్‌పేట్‌కి చేరుకున్నాక, మా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను నవీన్‌ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కత్తితో దాడి చేశాను’’ అని చెప్పాడు.

Nalgonda Crime: నవీన్ హత్య కేసులో ట్విస్ట్.. ‘గుడ్ బాయ్’ అంటూ అమ్మాయి రిప్లై

తన ప్రియురాలిని ప్రేమించిన కోపంలో నవీన్ ప్రైవేట్ భాగాలను తాను కోశానని.. అలాగే గుండె, తల, చేతి వేళ్ళు, చేతులు, ఇంకా మిగతా భాగాల్ని కత్తితో వేరు చేశానని కృష్ణ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అనంతరం అక్కడి నుంచి తాను పారిపోయానని తెలిపాడు. అతడు ఇచ్చిన ఈ వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. నవీన్ హత్య విషయాన్ని ఆ అమ్మాయికి కృష్ణ ఫోన్ చేసి తెలియజేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు.. నవీన్ శరీర భాగాల ఫోటోలను పంపగా.. అవి చూసి ‘గుడ్ బాయ్’ అంటూ ఆ అమ్మాయి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో.. ఆ అమ్మాయిని కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చబోతున్నారు.