Hyderabad; నవీన్ హత్య కేసులో ప్రియురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

నవీన్ హత్య కేసు దర్యాప్తులో కీలక మైన మలుపు ఇది. హరిహర కృష్ణ, నవీన్‌ల స్నేహితురాలు.. నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకూ రోజుకో సంచలన విషయం వెలుగుచూడగా.. తాజాగా మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. నిందితుడు హరిహరకృష్ణ (Hari Hara Krishna), అతని స్నేహితురాలును పోలీసులు విచారిస్తున్నారు.

ఇప్పటికే ఇద్దర్నీ వేర్వేరుగా విచారించి, ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా పోలీసులు ఇప్పించారు. అయితే ఈ ఘటనపై మొదటిసారి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ (Rachakonda CP DS Chauhan ) మీడియాతో మాట్లాడారు. కేసులో అసలేం జరుగుతోంది..? ఇప్పటి వరకూ విచారణ ఎలా సాగింది..? ముఖ్యంగా అమ్మాయి పాత్రేంటి..? అనే విషయాలు ఒకే ఒక్క మాటతో తేల్చేశారు.

బిగ్ బ్రేకింగ్ న్యూస్

నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్‌లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ. దీంతో ఆమెను కూడా నిందితురాలుగా చేర్చారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. యువతి కోసమే నవీన్‌ను హత్య చేసినట్టు కస్టడీలో ఒప్పుకున్నాడు హరి హర కృష్ణ. దీంతో ప్రియురాలు నిహారికను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్య అనంతరం హరిహర కృష్ణ మిత్రుడు హసన్ ఇంటికి వెళ్లి.. అతడికి వివరాలు చెప్పి.. నెత్తుటితో తడిసిన బట్టలు మార్చుకున్నాడు హరిహర కృష్ణ. ఆ సమాచారం అతడు పోలీసులకు ఇవ్వలేదు. దీంతో హసన్‌ను కూడా ఒక నిందితుడిగా చేర్చారు పోలీసులు. నేరాన్ని దాచి పెట్టడం కూడా నేరమే.. అందుకే వీరిద్దర్నీ కూడా నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్, ఏ3గా యువతిగా చేర్చారు.

నవీన్‌ను హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. హత్య విషయాన్ని స్నేహితుడు హసన్‌కు చెప్పాడని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ పారిపోయి.. ఖమ్మం, విజయవాడ, విశాఖ, వరంగల్‌కు వెళ్లాడని డీసీపీ వివరించారు. హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత 1500 రూపాయలు నిహారిక హరిహరకు ట్రాన్స్‌ఫర్ చేసిందని వివరించారు. గత నెల 24న తిరిగి వచ్చి యువతి, హసన్‌ను హరిహరకృష్ణ కలిశాడని తెలిపారు. లొంగిపోవడానికి ముందు నవీన్‌ను చంపిన చోటుకు యువతిని, హసన్‌ను హరిహర కృష్ణ తీసుకెళ్లాడని డీసీపీ వెల్లడించారు. నిహారిక ఫోన్‌లోని డేటాను కూడా డిలీట్ చేసిందని… ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడిందని పోలీసులు తెలిపారు. హత్య విషయం తెలిసినా ఇద్దరూ పోలీసులకు చెప్పలేదని.. అందుకే వారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.

చివరికి ఎం జరిగింది?

నవీన్ కేసులో పాత్రధారులెవరు..? సూత్రదారులెవరు..? అని వీలైనంత త్వరగా తేల్చేయాలని రోజుకో కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫైనల్‌గా పోలీసులు ఏం తేలుస్తారో.. ఇంకా రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే మరి.