Andhra News: సోషల్‌ మీడియాలో తొలిరాత్రి దృశ్యాలు పోస్ట్ చేసిన భర్త

చేతిలో స్మార్ట్‌ఫోనుంది కదా.. అని ఏది పడితే అది పోస్ట్ చెయ్యటం వల్ల వచ్చే ప్రమాదాలు అన్ని ఇన్ని కాదు, అయినప్పటికీ కూడా చాల మంది ఇంకా వాటిని గ్రహించలేకపోతున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా, భార్య ఆత్మగౌరవం దెబ్బతినేలా తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలను చిత్రీకరించిన ఉన్మాద భర్త.. వాటిని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది.

*ఫస్ట్‌నైట్’ను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త అరెస్ట్*

*అందులోనూ ట్విస్ట్ మైనర్ బాలిక కు పెళ్లి చేసిన తల్లిదండ్రులు*

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఘటన

ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం

ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియాకెక్కించేసి కలకలం రేపిన వైనం

బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్

సోషల్ మీడియాలో తొలిరాత్రి దృశ్యాలు: భర్తకు కటకటాలు

 

కాట్రేనికోన: చేతిలో స్మార్ట్‌ఫోనుంది కదా.. అని సభ్యసమాజం తలదించుకునేలా, భార్య ఆత్మగౌరవం దెబ్బతినేలా తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలను చిత్రీకరించిన ఉన్మాద భర్త.. వాటిని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది.

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా: కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో జరిగిన ఈ ఘటనతో అతను కటకటాలపాలయ్యాడు. ఫిబ్రవరి 8న ఆ యువకుడి(20)కి గ్రామానికే చెందిన బాలిక(17)తో వివాహమైంది. అతడు తమ మొదటి రాత్రి దృశ్యాలను సామాజిక మాధ్యమంలో ఉంచాడు. విషయం తెలిసి.. బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆ యువకుడిని గత నెల 28న అరెస్టు చేశారు. కోర్టులో 14 రోజుల రిమాండ్‌ విధించారని కాట్రేనికోన ఎస్సై టి.శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. అయితే.. తొలుత బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడగా, అధికార పార్టీ ప్రాబల్యం ఉన్న ఆ గ్రామపెద్దలు ప్రైవేటు పంచాయితీ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించినట్లు సమాచారం.

సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి రహస్యాలను కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఇలాగే జరిగింది.

గత నెల 8న గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు 20 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను వీడియో తీసి వాటిని అతడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా కలకలం రేగింది.

విషయం తెలిసిన బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని కాట్రేనికోన పోలీసులు నిన్న వెల్లడించారు.