ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

Medico Preethi Funeral Ended At Girni Thanda - Sakshi

సాక్షి, జనగామ: గిర్నితండాలో మెడికల్‌ పీజీ విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇక, ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటు, వివిధ పార్టీల నాయకులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.