అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పెను ప్రమాదం జరిగింది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

ప్రమాదం జరగటానికి గల కారణాలు 

ద్విచక్ర వాహనం పై వెళుతున్న ముగ్గురు విద్యార్థులు కార్ ను దాటించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొన్న ముగ్గురు విద్యార్థులు..

లారీని బలంగా డీ కొట్టటంతో చాలా పెద్ద ప్రమాదమే చోటుచేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మృతులలో ఒకరు కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామానికి చెందిన యన్.నారేంద్ర కాగా మరొకరు అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి కుచెందిన యన్. రాజేష్.

వీరిద్దరూ అమలాపురం శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులుగా గుర్తింపు