ఆ హీరో కి పెళ్లైనప్పుడు నా మనసు ముక్కలైనంత భాద కలిగింది

Meena: ప్రేక్షకులకే కాదు సినీతారలకూ ఇతర నటులపై క్రష్‌ ఉంటుంది. ఈ జాబితాలో నిలిచే సినీ తారల్లో మీనా (Meena) ఒకరు.

మీనా కి క్రష్ ఉన్న హీరో ఎవరు?

బాలీవుడ్‌ ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) తన అభిమాన నటుడని గతంలోనే చెప్పిన ఆమె మరోసారి ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఇటీవల ఓ తమిళ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన ఆరాథ్య నటుడి పెళ్లిని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను హృతిక్‌రోషన్‌ను ఎంతగానో ఇష్టపడతా. నాకు పెళ్లికాకముందు హృతిక్‌ రోషన్‌లాంటి భర్త రావాలనుకునేదాన్ని. ఆయనకు పెళ్లైనప్పుడు చాలా బాధపడ్డా. ఆ సమయంలో నా హృదయం ముక్కలైంది’’ అంటూ మీనా నాటి సంగతులు నెమరువేసుకున్నారు.

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన విద్యాసాగర్‌తో మీనా వివాహం 2009లో జరిగింది. ఊపిరితిత్తుల సమస్యతో విద్యాసాగర్‌ గతేడాది జూన్‌లో మరణించారు. ఆ విషాదం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. మీనా సినీ ప్రస్థానం బాల నటిగా మొదలైన సంగతి తెలిసిందే. తన కెరీర్‌ 40ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో ఇటీవల ‘మీనా 40’ పేరుతో వేడుక నిర్వహించారు. రజనీకాంత్, సుహాసిని, రోజా తదితరులు హాజరై సందడి చేశారు. ఆ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీనా తాజాగా పోస్ట్‌ పెట్టారు.

 మీనా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు

తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాల్లో అదొకటని పేర్కొన్నారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘చంటి’, ‘ముఠామేస్త్రి’, ‘అబ్బాయిగారు’, ‘అల్లరి అల్లుడు’, ‘సూర్యవంశం’, ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ తదితర చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.