గంజాయి బ్యాచ్ ఉంది- ఇంటి అమ్మాయి జాగ్రత్త !

గంజాయి బ్యాచ్ ఉంది- ఇంటి అమ్మాయి జాగ్రత్త ! “స్వర్గానికెళ్లితే రంభ ఊర్వశి దొరుకుతారో లేదో . సుఖ పడితే… ఇక్కడే.. ఇప్పుడే .. భూమ్మీదే సుఖ పడాలి”
…. ఇది కదా ఉన్నత విద్యాలయం సాక్షిగా ఒక సినీ దర్శకుడు యువత మెదళ్లలోకి ఎక్కించాలని చూసిన విషం ?

రాక్షసులకు అలనాడు శుక్రాచార్యడు అనే గురువుండేవాడట .
పూర్తిగా బ్రష్టుపట్టిన యువతకు గురువు కావాలని ఆ సినీ దర్శకుని ప్రయత్నమా ?
లేక యువత మనసులోని భావాలనే అతడు మాటల్లో చెప్పాడా ?

ఈ వివాదంతో నాకు పనేమీ? అనుకోకండి .
ఈ మెసేజ్ ఆ వివాదం గురించి కాదు .
పూర్తిగా చదివి అప్రమత్తం కండి.
లేక పొతే ఉపద్రవం ఖాయం .

ఇది ఊరూరా జరుగుతున్న కథ .
ఏదో ఒక రాష్ట్రానికో , ఒక ప్రాంతానికో పరిమితమయిన కథ కాదు .
రాజకీయాలతో ముడిపెట్టకండి .
.

కరోనా .. .
లాక్ డౌన్ .. .
ఆన్లైన్ క్లాసులు .
పిల్లల చేతికి సెల్ ఫోన్ .

యు ట్యూబ్ , నెట్ఫ్లిక్ , నీలి చిత్రాలు , ఫాన్స్ ఓన్లీ అప్ ఇంస్టాగ్రామ్ , స్నాప్ చాట్ , వయొలెంట్ వీడియోస్ ..
దరిద్రానికి ఎన్ని పేర్లో! .
పిల్లల మెదళ్ళు విషపూరితం .

అదేంటి ?యూట్యూబ్ లాంటి వాటిలో ఎంతో విజ్ఞానం ఉంది కదా? దాన్ని దరిద్రం అనడం ఏంటి? లాంటి చర్చలు వద్దు .
నేను మాట్లాడుతున్నది వాస్తవంగా జరుగుతున్న దాని గురించి .
దోసడు మంచి ..
… సముద్రమంత విషం .
పిల్లలు దేనికి ఆకర్షితులవుతున్నారు అనేది ముఖ్యం .

అదొక ఊరు.
పేరేంటని అడగకండి .
మీ ఊళ్ళో.. టౌన్ లో… కాలనీ లో.. గేటెడ్ కమ్యూనిటీ లో … ఇది జరుగుతుందా? లేదా చెక్ చేసుకోండి .
జరగకపోతే నన్నడగండి .

ముందుగా సెల్ ఫోన్ . అందులో విచ్చలవిడిగా.. క్రైమ్ … సెక్స్ చిత్రాలు .
లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి . చేయకపోతే వేస్ట్ అని యువత కు బ్రెయిన్ వాష్ చేసే వేలాది చిత్రాలు .
క్రైమ్ ఎలా చెయ్యాలో పూస గుచ్చినట్టు వివరించే వీడియో లు

మద్యం ..
గుట్కా ..
నైల్ పోలిష్ , వైట్నెర్, హుక్కా , గంజాయి ..
లవ్ .. చాటింగ్ ..
అమ్మాయి- అబ్బాయి సెక్స్ .. అబ్బాయి- అబ్బాయి సెక్స్ .. అమ్మాయి -అమ్మాయి సెక్స్ .. నపుంసకులతో సెక్స్ ..
పబ్ లు .. వీక్ ఎండ్ పార్టీ లు . రేవ్ పార్టీ లు .
వీటిలో కనీసం రెండో మూడో ..

ఇవే నేటి స్టార్ట్ అప్ లు ..
కరోనా కాలం తో మొదలెట్టి … ఊరు- వాడ, పల్లె -పట్నం .. ఇందుగలడందు లేదని వ్యవస్తీకృతం అయిపోయిన స్టార్ట్ అప్ లు ..

ఈ స్టార్ట్ అప్ లకు ముడి సరుకులు 12 – 16 ఏళ్ళ అమ్మాయిలు .
13 – 20 ఏళ్ళ అబ్బాయిలు .
సెల్ ఫోన్ ఒకటే ప్రారంభ పెట్టుబడి .
అటు పై అన్నీ వాటంతవే సమకూరుతాయి .

ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి .
” మన పిల్ల పాపం పసిది.
దానికేమి తెలుసు?” అనే భ్రమలో తల్లితండ్రులు .

పిల్లలు దేవుడు చల్లని వారే .
సెల్ ఫోన్ దేవుడి చేతిలో లేదు గా .
బతికి పోయాడు దేవుడు ..

ఆ ఊళ్లో ఇరవై ఏళ్ళ గంజాయి బ్యాచ్ యువకుడు .
లిక్కర్ .. గంజాయి .. రోజుకింతని డబ్బు కావాలి .
చదువు ఎప్పుడో కొండెక్కింది .
గంజాయి మత్తు, పొందు కోరుతోంది .
సెక్స్ వీడియో లు రేకెత్తించే వాంఛను ఎన్నాళ్లని చేతితో తీర్చుకొంటాడు ?
ఏదో చెయ్యాలి…

యూట్యూబ్ లో Netflix లో సవా లక్ష వీడియో లు ..
ఐడియా ల కేమి కొదవ ?

ఆ ఊళ్లో / కాలనీ లో కాస్త అందంగా, అమాయకంగా వుండే అమ్మాయి ని సెలెక్ట్ చేసుకొన్నాడు . పరువు గల కుటుంబం . తల్లితండ్రికి బాగానే ఆస్తులు ఉన్నాయి.
ఇంస్టాగ్రామ్ చాటింగ్ మొదలయ్యింది …

“నువ్వంటే నా కిష్టం . నువ్వు లేక పొతే బతకలేను . నీ కోసం ఏమైనా చేస్తాను . కాదంటే చస్తాను ” .

ఈ మాటలకు పడిపోని టీన్ ఏజ్ అమ్మాయి కలియుగం లో ఉండదు .
కాస్త ముందు .. వెనుక ..
ధైర్యం .. తటపటాయింపు ..
అంతే తేడా !

“మన అమ్మాయి బుద్ధిగా చదువుకొంటోంది . స్కూల్ కెళ్ళి వస్తోంది” అనే భ్రమ లో తల్లితండ్రులు .

ఇంస్టాగ్రామ్ చాటింగ్ లో ప్లానింగ్ జరిగిపోతోంది
“నా కోసం ప్రాణమిచ్చే అబ్బాయి ఒక పక్క .
ఎప్పుడూ” చదువు చదువు “అని హుంకరించే తండ్రి తల్లి ఒక పక్క”
డైలెమా లో అమ్మాయి . .

ఒక వేళా ” మా అమ్మా నాన్న ను వదిలి రాలేను ” అని అమ్మాయి చెప్పినా ,
గంజాయి బ్యాచ్ దగ్గర ఒక రిప్లై సిద్ధం ….

“అబ్బే ఎప్పటికీ దూరంగా ఉండము. ఇక్కడే ఉండి మన ప్రేమ గురించి చేబితే వారు ఒప్పుకోరు . పైగా నిన్ను కొడుతారు . నన్ను చంపడానికి ప్రయత్నిస్తారు . నీ గురించి నా ప్రాణం ఇవ్వడికైనా నేను రెడీ బంగారం . కానీ నా బాధంతా నీ గురించే . నేను లేకుండా నువ్వు బతకగలవా ? జస్ట్ ఒక వారం గోవా లేదా ముంబై లో ఎంజాయ్ చేసి వద్దాము . మన విషయం ఊరంతా తెల్సి పోతుంది . అప్పుడు చచ్చినట్టు మీ వారు ఒప్పుకొంటారు. మా వారిని ఒప్పించే బాధ్యత నాది “… ఈ ట్రాప్ కు పడని టీన్ ఏజ్ అమ్మాయి ఇంకా భూమి మీద పుట్టలేదు

గంజాయి బ్యాచ్ గాడి రియల్ ప్లాన్ వేరొకటి .
యూట్యూబ్ .. ఇంస్టాగ్రామ్ .. సినీ శుక్రాచార్యుడి శిష్య బృందం మరి !
ముదురు ఆలోచనలు . ముదురు ప్లానింగ్

అమ్మాయిని లేవ దీసుకొని పొతే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది . గోవా కో ముంబై కో వెళ్లి వారం రోజులు ఫ్రీ గా సెక్స్ .. అదీ వర్జిన్ తో సెక్స్చెయ్యొచ్చు . దానికి పెట్టుబడి అమ్మాయే తెస్తుంది . ఇంట్లో డబ్బులుంటాయి… లేదా కనీసం చేతికి నాలుగు గాజులుంటాయి కదా .
అది అమ్మితే గోవా లో వారం గడవదా ?

ఈ లోగ పోలీస్ లు ఎలాగూ రంగం లో దిగి పట్టుకొంటారు .
అమ్మాయి ని లేవదీసుకొని పోయిన వాడి పై కేసు పెట్టాలి అనే కసితో తల్లితండ్రులు .

“పిచ్చోడా ! కేసులు గీసులంటే పరువు పోతుంది . వాడసలే మంచి వాడు కాదు . కక్ష కట్టి మీపైన ఏదయినా అఘాయిత్యం చేయొచ్చు . జరిగిందో జరిగింది .. ఇక వదిలేయండి” అని ఘరానా పెద్ద మనుషులు మనుషులు ..

” పోస్కో చట్టం అయితే ఏంటట ? మూడు నెలల్లో బెయిల్ వస్తుంది . అటు పై కేసు .. మీ అమ్మాయి పదుల సార్లు కోర్ట్ మెట్లు ఎక్కాలి . సెక్స్ జరిగింది అని నిరూపించాలి . అది అంత ఈజీ కాదు . ఎందుకీ గొడవలు . చూడు నీ ముందే వాడిని పీకుతా” అని నాలుగు పీకి నీకు సాయం చేసినట్టే నటించే కింది స్థాయి పోలీస్ .

ఘరానా పెద్ద మనిషి.. కింది స్థాయి పోలీస్ … గంజాయి బ్యాచ్ కి అమ్ముడు పోయారు అనే విషయం అమ్మాయి తల్లితండ్రులకు నెలకో రెండు నెలలకో తీరిగ్గా అర్థం అవుతుంది .

ఇది ఒకటో సీన్ .. ఇప్పుడు రెండోది

“లేచి పోయిన అమ్మాయి .. చచ్చిన దానితో సమానం” అని తల్లి తండ్రి వదిలేస్తే ?

గంజాయి బ్యాచ్ కి ఆ మాత్రం తెలివి తేటలు ఉండవేంటి ?

వయసులో ఉన్న అమ్మాయి… కాస్త అందం గా ఉన్న అమ్మాయి చేతిలో ఉంటే లక్షలే లక్షలు .
రూమ్ లో కూర్చొని.. టేబుల్ ముందు సెల్ ఫోన్. అందులో ఫాన్స్ ఓన్లీ అప్ .. బట్టలు విప్పుతూ .. మాట్లాడుతూ ఉంటే వారం లో లక్ష .
ఇంకా నీలి చిత్రాల్లో యాక్టింగ్ .. డ్రగ్స్ స్మగ్గ్లింగ్ .. పబ్బుల్లో గంటకింత అని లెక్కలో గర్ల్ ఫ్రెండ్ గా ..
డబ్బులే డబ్బులు ..
వయసే పెట్టుబడి .

ఎక్కడున్నారండీ మీరు ?
కరోనా కాలం లో యువత చాలా ముందుకెళ్లి పోయింది .
ఇదేదో నేను ఊహించి రాసిన స్టోరీ కాదు . జరిగిన జరుగుతున్న నిజ జీవిత వాస్తవాలు .

పరిష్కారాలు .

1 . చిన్న పిలల్లు .. అమాయకులు అనే అమాయకత్వాన్నుండి బయటకు రండి . ఇరవై ఏళ్ళు దాటిన అమ్మాయిని ట్రాప్ చెయ్యడం కష్టం. 13 – 16 ఏళ్ళ అమ్మాయిలే సాఫ్ట్ టార్గెట్స్ …
“భూమీద సుఖపడాలి .. ఫుడ్ సెక్స్ రెండే ముఖ్యం” అనే సినీ శుక్రాచార్యుని శిష్య బృందం టార్గెట్స్ వారే .
ఎమోషనల్ మెచూరిటీ లేక ఈజీ గా ట్రాప్ లో పడిపోతున్నది ఏడు నుంచి పదో తరగతి అమ్మాయిలే అనే వాస్తవాన్ని గ్రహించండి .

2 . పిల్లల చేతికి సెల్ ఫోన్ వద్దు . రాత్రి మీరు బాగా నిద్దరోయాక మీ సెల్ ఫోన్ వారు వాడే ప్రమాదముంది . జాగ్రత్త .

3 . ఇది వరకే వారు సెల్ ఫోన్ కు బానిసలయి ఉంటే వారికి చాల పవర్ఫుల్ కౌన్సిలింగ్ అవసరం . మీ ఏరియా లో టౌన్ లో కనీసం వంద మంది పిల్లలతో మీరు సమావేశం ఏర్పాటు చేస్తే నేను నా వీలు బట్టి వచ్చి ఫ్రీ క్లాస్ తీసుకొంటాను . నాకు పారితోషికాలు .. పూలదండలు .. దుప్పట్లు వద్దు . రెండు గంటల క్లాస్ తీసుకొవడానికి ఒక వాటర్ బాటిల్ టేబుల్ పై పెడితే సరిపోతుంది .

4 . మీ పిల్లల సెల్ ఫోన్ పిచ్చి బాగా ముదిరి వారు పెడదారి పట్టుంటే వారిని మంచి హాస్టల్ లో చేర్పించండి . దాపరికం లేకుండా ఈ విషయాన్ని స్కూల్ వారికి చెప్పండి . వారి సాయం పొందండి .

5 . ప్రతి స్కూల్.. ప్రతి కాలేజీ ఈ విషయం లో తల్లితండ్రుల్లో పిల్లలలో అవగాహన తీసుకొని రావాలి.

6 . జిల్లా ఎస్పీ లు .. DIG . ఐజీ లు .. డిజిపి లు ..
నవ తరానికి నవ పోలీసింగ్ అవసరం లేదా ?
మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ లో విన్న పాఠాలకు నేడు ఫీల్డ్ లో చూస్తున్న దానికి ఎంతో తేడా ఉందని అర్థమయ్యింది కదా ?
క్రైమ జరగకుండా చూడడానికంటే మించిన ఎఫెక్టివ్ పోలీసింగ్ లేదని మీకు తెలుసు కదా ?
అయితే ఇంకేంటి ?
స్కూల్స్ లో కాలేజీ ల లో యూనివర్సిటీ ల లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తే మీ క్రైమ్ కేసుల భారం సగానికి సగం తగ్గదా ?

పిల్లి మెడలో గంట కట్టే IPS ఆఫీసర్ ఎవరు ??