ప్రధానితో సీఎం జగన్‌ ప్రస్తావించిన అంశాలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు: ♦రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. … Read more

AP News: ఇబ్బంది పడే పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి

*ఇబ్బంది పడే పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి… హెడ్ మాస్టర్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశం..* *జ్వరం, దగ్గు, జలుబుతో సతమతమవుతున్న బాధితులు రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు. H3N2 వైరస్ దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.* H3N2 వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లేపుతోంది. ఇది వందేళ్ల నాటి వైరస్. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అవుతూ వస్తుంది. ఇది జనవరిలోనే స్టార్టయ్యింది. ఇప్పుడు పీక్‌కి చేరింది. చాలామంది దీని బారిన పడి … Read more

AP Studies: వివాహాలు వేచి ఉండగలవు కానీ విద్య కాదు

✨”దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు.. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా…” అన్న మాటల స్ఫూర్తితో, ప్రపంచాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లగలిగే శక్తిమంతమైన ఆయుధం విద్య అన్నే నమ్మకాన్ని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకమే “వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా”. 👰🏻‍👰🏻‍వివాహాలు వేచి ఉండగలవు కానీ విద్య కాదు…📖 ✅బాల్య వివాహాల నిరోధమే సంకల్పంగా ఇకపై పెళ్లిని చదువుతో ముడిపెట్టి పెద్ద చదువులకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.👏🏻 ✅వధువు, వరుడికి 18 & 21 సంవత్సరాలు నిండి ఉండాలి, తప్పనిసరిగా 10వ తరగతి … Read more

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు

*ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు ?* *సుప్రీంకోర్టు జడ్జి హింట్ ! రాజ్యాంగ ధర్మాసనానికి వెళితే ?* అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారం మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్డి కేఎం జోసెఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రైతులకు వరంగా మారాయి. ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ … Read more

AP CM: సీఎం జగన్ సమక్షంలో ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ.. సమ్మిట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు. నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతోంది. ఏపీలో జియో నెట్‌వర్క్‌ అభివృద్ధి చెందింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రగతికి ఏపీ సర్కార్‌ మంచి సహకారం అందిస్తోంది. ఏపీలో వనరులు పుష్కలంగా … Read more

Vijayawada Crime News: విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం

Vijayawada Crime News Mar 3: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అసలేం జరిగిందంటే..? సీఐ కాగిత శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. స్టేషన్‌ … Read more

AP News: ఏపీలో మళ్లీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు

*మళ్లీ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం – ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీ రిస్క్ తీసుకుంటోందా ?* *ఏపీలో మళ్లీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు* *ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉద్యోగులు* *ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం* *ఎన్నికలకు ముందు అధికార పార్టీ రిస్క్ తీసుకుంటోందా ?* ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అనే వాతావరణం మళ్లీ ఏర్పడుతోంది. ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు,కేఆర్ సూర్యనారాయణ సీఎస్‌కు తమ ఉద్యమ షెడ్యూల్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మమూలుగా కదిలేది కాదని.. … Read more

జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరండి

కులాలను కలిపే ఆలోచనా విధానంతో, మత ప్రస్తావనలేని రాజకీయ విధానంతో, భాషలను గౌరవిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతి రహిత సమాజ స్థాపనే ద్యేయంగా, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ ఆరోగ్యవంతమైన సమ సమాజాన్ని భావి భారత పౌరులకు అందించే మహోన్నత లక్ష్యంతో ఏర్పడిన జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మచుకునే ప్రయత్నంలో భాగస్వాములు కావలసిందిగా జనసేనపార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు దర్శి … Read more

YCP MLC Candidates List: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా

AP sasana mandali

వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించారు. తాజాగా స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీల పేర్లను నేడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం నేడు వాటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మధ్యాహ్నం అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని వైసీపీ చెబుతోంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను ప్రకటించనుంది. మొత్తం 16 ఎమ్మెల్సీ … Read more